ఖైదీ నెం 150 మూవీ రివ్యూ

0
31
Khaidi no 150 telugu movie review

చిరంజీవి 9 సంవత్సరాల తరువాత మళ్లీ  వెండి తెర మీదకు తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో ఖైదీ నెంబర్ 150 గా వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రీమేక్ సినిమా అయినప్పటికీ చిరుకి కథ బాగా నచ్చడం అలాగే దర్శకుడు చిరు కోసం కథలో కొన్ని మార్పులు చేసాం అని చెప్పడం తో సినిమాపై బారి అంచనాలు పెరిగాయి. మరి వాళ్ళ అంచనాలకు తగట్టుగా సినిమా ఉందొ లేదో తెలుసుకోవాలి అంటే కథలోకి వెళ్ళలిసిందే.

కథ:

కథ జైలు గోడల మధ్య నుండి మొదలవుతుంది. కత్తి శ్రీను (చిరంజీవి)  ఒక రోజు జైల్లో నుండి తప్పించుకొని తన స్నేహితుడు అయినా మల్లిని (ఆలీ) కలుస్తాడు.  శ్రీను కోసం పోలీసులు తీర్వంగా గాలిస్తుంటారు. దాంతో శ్రీను బ్యాంకాక్ వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో లక్ష్మి (కాజల్) పరిచయం అవుతుంది.  లక్ష్మి ని చుసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు దాంతో తన బ్యాంకాక్  ప్రయాణాన్ని మనుకుంటాడు.ఆ తరువాత శ్రీనికి శంకర్ అనే వ్యక్తి  పరిచయం అవుతాడు. శంకర్ ల్యాండ్ విషయంలో కార్పొరేట్ కంపెనీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. మిగిలిన కథ శంకర్ సమస్యను శ్రీను ఎలా పరీక్షారిస్తాడు? అసలు శ్రీను, శంకర్ గా ఎందుకు మారతాడు? అని తెలుసుకోవాలి అంటే వెండి తేరా మీద చూడాల్సిందే.

ప్రదర్శనలు: 

చిరంజీవి వెండి తెరకు దూరమయ్యి 9 సంవత్సరాలు అయినా ఆ లుక్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు. ఇప్పుడు వున్నా యంగ్ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోకుండా తన డాన్స్ స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించారు.

కాజల్ తన పాత్ర ఎక్కువ లేకపోయినా ఉనంతసేపు చాలా బాగా పెర్ఫార్మన్స్ చేసింది. అలాగే పాటలలో తన అందాలను చూపిస్తూ ప్రేక్షకులను బాగా అలరించారు.

బ్రహ్మానందం అంటేనే ఎక్సప్రెషన్స్ కి పెట్టింది పేరు అయన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.

ఆలీ చాలా బాగా పెర్ఫార్మన్స్ చేసారు. ముఖ్యంగా చిరంజీవి కి ఆలీ మధ్య జరిగే సన్నీ వేశాలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

వీ. వీ.  వినాయక్ తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను సమర్ధవంతంగానే పోషించాడని చెప్పాలి. చిరంజీవిని తన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలానే చూపిస్తూ , కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సాంగ్ లొకేషన్స్ చాల బాగున్నాయి. కాస్ట్యూమ్స్ సూపర్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ లో చిరు స్టెప్స్ అదరకొట్టేసారు. కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీ , శేఖర్ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు సినిమాకే మేజర్ హైలెట్ గా నిలిచాయి. కీలక సన్నివేశాలలో  వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  చాల బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రధానంగా కనిపించేది బలం లేని ప్రతి నాయకుడి పాత్ర అనే చెప్పాలి. చిరంజీవి అంతటి స్టార్ హీరోకి ఇమేజ్ ని సినిమాలో మోయాలంటే అంతే బలమైన ప్రతి నాయకుడు అవసరం. ఆద్యంతం హీరోతో పోటీ పడుతూ హీరో పాత్ర బలంగా మారేలా చేయాలి. కానీ ఇందులో విలన్ పాత్ర అలా చేయలేదు. దాంతో భారం మొత్తం చిరంజీవి పైనే పడింది. నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

ముగింపు :

ఖైదీ నెంబర్ 150 సినిమా చిరంజీ కం బ్యాక్ మూవీ. చిరంజీవి స్టైల్, డాన్స్, డైలాగ్ డెలివరీ తో ఫాన్స్ ని బాగా అలరించారు.

మా రేటింగ్  2.8/5

Book tickets now with Bookmyshow.com 


 కాస్ట్ అండ్ క్రూ 

కాస్ట్: మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాయి లక్ష్మి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, ఆలీ, పృథ్వి రాజ్, రామ్ చరణ్ మరియు ఇతరలు

దర్శకత్వం : వి వి వినాయక్
నిర్మాత: రామ్ చరణ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్
విడుదల తేది: జనవరి 11, 2016

Comments

comments

LEAVE A REPLY